డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తాం – మున్సిపల్ అధికారులు

-

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట లోని దక్కన్ మాల్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది నలుగురు కార్మికులను రక్షించగా.. మరో ముగ్గురు భవనం లోపల చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అగ్ని ప్రమాద ఘటనలో మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది.

భవనంలో 12 గంటలకు పైనే అగ్నికిలలు ఉండడంతో లోనికి ఎవరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే భవనం లోపల చిక్కుకున్న కూలీల సెల్ఫోన్ లొకేషన్స్ భవనంలోనే చూపిస్తూ ఉండడంతో వారు అందులోనే ఉండిపోయారని భావిస్తున్నారు. ముగ్గురు కార్మికులకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది.

భవనం లోపలికి వెళ్లాలంటే క్రేన్, డ్రోన్ సహాయంతోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రమాదానికి గురైన డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. భవనం వెనక భాగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. బిల్డింగ్ నిలబడలేని స్థితిలో ఉందన్నారు. దీంతో కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిసి రాజేష్ చంద్ర తెలిపారు. చుట్టుపక్కల వారికి ప్రమాదం లేకుండా భవనాన్ని కూలుస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news