గురుకులాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర ట్వీట్..!

-

కాంగ్రెస్  ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం పదే పదే రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి చెబుతున్నారు. 5 లక్షల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3 కోట్లు కేటాయిస్తే..  మా ప్రభుత్వం రూ.5వేల కోట్లను రెసిడెన్షియల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించిందని తెలిపారు.

దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నారని అరకొర ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.  ఈ క్రమంలోనే కరీంగనర్ లో ఓ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించినప్పుడు వసతులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుతున్న ప్రతి బిడ్డకు బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనే ఆలోచనతో మీరు సంవత్సరానికి రూ. 3 కోట్లు నిధులు కేటాయిస్తే.. మేము ఏడాదికి రూ. 5 వేల కోట్లు రెసిడెన్షియల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడతామని.. ఇది మా నిబద్ధతకు నిదర్శనం” అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news