నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అరవింద్ నామినేషన్ కి చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ వేసిన అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతుల ఆశీర్వాదంతోనే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. డిపాజిట్ కి ఖర్చు కూడా రైతులు ఇవ్వడం సంతోషకరమన్నారు. పసుపు రైతు రమేష్ తనకు ఈ ప్రపోజల్ ఇచ్చారని తెలిపారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలపై దృష్టి పెడతామన్నారు. అన్నీ పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తామని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దడం మా మేనిఫెస్టోలో ఉందని తెలిపారు. ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.