కేటీఆర్ ఆనాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

-

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని మంత్రిగా చేసినప్పుడు కేసీఆర్ను ఎందుకు కేటీఆర్ నిలదీయలేదని ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బంతి భోజనాలు చేస్తున్నాడని సెటైర్లు వేశారు.

పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వీడ్కోలు పార్టీలు ఇస్తున్నాడన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ గేట్లు ఎందుకు తెరుచుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తుఫాన్లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. ఆ నావలో ఎవరూ ఉండరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కేసీఆర్ హీనాతిహీనంగా చూశారన్నారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవం ఆ ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మిగిలేది ఆ నలుగురు మాత్రమే..త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఉన్న గౌరవంతోనే మా సీఎం ఆయన ఇంటికి వెళ్లారని గురు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news