ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన రాహుల్ గాంధీ భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. తెలంగాణలో కులగణన దేశానికే రోడ్డు మ్యాప్ అన్నారు. ఎవరు ఏమనుకున్నా ఎలాంటి విమర్శలు చేసినా నేను పట్టించుకోనని తెలిపారు. నాపై అబద్దపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను ప్రధానిని కించపరచలేదు. కులగణన పై రాహుల్ గాంధీకి వివరించాను. ప్రతిపక్షాలు కులగణన పై అనవసర రాద్దాంతం చేస్తున్నాయి.
కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు. నేను కొందరికీ నచ్చకపోవచ్చు.. తనను కొందరూ అంగీకరించకపోవచ్చు అన్నారు. అయినా తన పని తాను చేసుకుపోతున్నానని తెలిపారు. రాజకీయ కోణంలో కాదు.. ప్రజాకోణంలోనే కులగణన జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంట్ లో బిల్లు తీసుకొస్తామని తెలిపారు. ఏ ఒక్క అంశాన్ని కూడా పక్కకు పెట్టడం లేదని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.