దానం నాగేందర్ పై స్థానిక కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ కోవర్ట్ గా దానం కాంగ్రెస్ లోకి వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అతని ఎంపీ అభ్యర్థిత్వాని రద్దు చేయాలని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ప్లకార్డులతో నిరసన, ఎంపీగా గెలిస్తే మళ్ళీ పార్టీ మారుతాడు. మాకు నమ్మకం కుదరాలంటే దానం తన ఎమ్మేల్యే పదవి రాజీనామా చేసి పోటీ చేయాలని స్థానిక ఖైరతాబాద్ నాయకులు విమర్శలు చేశారు.