దీక్షిత్ రెడ్డి నిందితుల ఎన్‌కౌంటర్‌…పోలీసుల క్లారీటి.

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో 9 ఏళ్ళ బాలుడు హత్యతో జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొంది.. కృష్ణా కాల‌నీకి చెందిన దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్‌ చేసిన మంద‌సాగ‌ర్‌,తల్లీ దండ్రులను రూ.45 లక్షల డిమాంగ్ చేసి..దారుణంగా హత్య చేశాడు..నిందితుడి మొబైల్ ఫోన్‌ నెట్ వర్క్‌ ద్వారా ఈరోజు ఉదయం నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు..అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్క‌డైతే హ‌త్య చేశారో అదే ప్రాంతంలో నిందితుడిని ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

ఈ వార్త‌ల‌పై మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. మంద సాగ‌ర్‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేద‌ని, అత‌ను త‌మ అదుపులోనే ఉన్నాడ‌ని స్ప‌ష్టం చేశారు..మంద సాగ‌ర్‌తో పాటు మ‌నోజ్ రెడ్డి అనే వ్య‌క్తిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కైతే దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి, హ‌త్య చేసింది మంద సాగ‌ర్ అని విచార‌ణ‌లో తేలింది. మ‌నోజ్ రెడ్డి పాత్ర‌పై కూడా విచార‌ణ చేస్తున్నామ‌ని తెలిపారు..