నాపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నా : మల్లారెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వద్దనే ఉన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని భేటీ అయ్యారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు.

వీరిలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలంగాణ భవన్ కి హాజరుకాకపోవడంతో వీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో నూతన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పందిస్తూ.. నాపై వార్త పత్రికల్లో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అని తెలిపారు. మరోవైపు నెటిజన్స్ మల్లారెడ్డి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కబ్జా చేసిన ల్యాండ్ అంత కొత్త ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఏ అర్హత లేకుండా నీ కాలేజీలు యూనివర్సిటీ చేసినవ్.. దాని మీద ఎంక్వయిరీ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news