550/100.. సైబరాబాద్‌లో డ్రంకన్‌డ్రైవ్‌లో నలుగురి బీఏసీ శాతం

-

మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొంతమంది మందుబాబులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఫూటుగా తాగి వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా.. ఎదుటి వారి ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో మందుబాబుల పని పట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

అయితే డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురు మందుబాబుల ఫలితాలు చూసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు(బీఏసీ) శాతం 550ఎంజీ/100ఎంఎల్‌గా రావడంతో కంగుతిన్నారు. సాధారణంగా 300 దాటితేనే ఎక్కువగా భావిస్తారు. అలాంటిది శనివారం రాత్రి ఓ నలుగురికి ఏకంగా 550/100 రావడం చూసి షాకయ్యారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా డ్రంకన్‌ డ్రైవ్‌లు నిర్వహించి 385మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

ఐటీ కారిడార్‌పై ఎక్కువ దృష్టి సారించిన పోలీసులు ఈ ఒక్క ప్రాంతంలోనే 182 మందిపై కేసులు నమోదు చేశారు.  పబ్బులు, క్లబ్బులు ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఐటీ కారిడార్‌లోని 17 ప్రధాన మార్గాల్లో వాహనదారులు తప్పించుకోలేని విధంగా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news