తెలంగాణలో వీఐపీలు సందర్శించిన చోట దొంగలు భీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సీఎం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సందర్శించిన పలు సమావేశాల్లో దొంగలు మొబైల్ ఫోన్లు, నగదు వంటివి ఎత్తుకెళ్లారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. వీఐపీల తాకిడి ఎక్కడ ఎక్కువగా ఉంటే.. అక్కడ దొంగలు వాలుతున్నారు.
జనాలు ఎక్కువగా ఉన్న చోట దొంగతనం చేయడం చాలా సులభమనుకొని వారు ఇలాంటి చేతివాటానికి తెర లేపుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంలో దొంగలు తమ చేతివాటం చూపించారు. పలువురి వద్ద నగదు ,నగలు కాజేసారు దొంగలు. ఓ దొంగను పట్టుకుని చితకబాదారు భక్తులు. దొంగ వద్ద రూపాయలు ఐదువేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నరు. మరో దొంగను పోలీసులకు అప్పగించారు భక్తులు. దేవుని వద్ద కూడా ఇలా దొంగతనాలకు పాల్పడుతారా..? వీరిని ఈ దేవుడు కూడా క్షమించడు అని పలువురు పేర్కొంటున్నారు.