టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పీసీసీ రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర సోష‌ల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వ‌ర్యంలో పిండ ప్ర‌దానం చేశారు.రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టంతో వెళ్లి ఆయ‌న పిండాల‌ను మూసీ న‌దిలో క‌లిపి వారి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా రాష్ట్ర క‌న్వీన‌ర్‌ఖ స‌తీష్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వ్య‌తిరేకి చంద్ర‌బాబు పెంపు కుక్క పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌బోమ‌ని భావి త‌రాల‌కు భ‌రోసాను ఇచ్చే భావిత‌రాల‌కు భ‌రోసానిచ్చే మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చారు.

రేవంత్‌రెడ్డి చంద్ర‌బాబు పెంపుడు కుక్క దానిని కూడా రాజ‌కీయం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. మా అధినేతకు 1200 చేయ‌మంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన రేవంత్‌రెడ్డికి ఇవ్వాళ మేము పిండ ప్ర‌దానం చేశామ‌న్నారు. మీ పార్టీ అధ్య‌క్షుని పుట్టుక‌నే ప్ర‌శ్నించిన బీజేపీనే ఎదురించిన గొప్ప మ‌న‌స్సు మా నాయ‌కుడు కేసీఆర్ అన్నారు.