జేపీ నడ్డా సభ…అట్టర్ ఫ్లాప్ – మంత్రి ఎర్రబెల్లి

జేపీ నడ్డా సభ అట్టర్ ఫ్లాప్ అని… ప్రజల నుండి రెస్పాన్స్ లేదని ఎద్దేవా చేశారు మంత్రి ఎర్రబెల్లి. మతాన్ని రెచ్చగొట్టి అధికారం లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్పు మరొకటి లేదు..కిషన్ రెడ్డి కూడా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఏంటి. తెలంగాణ అమలవుతున్న సంక్షమే పథకాల పైన చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

బీజేపీ పాల చేస్తున్న రాష్ట్రాల్లో ఇద్దరం కలిసి పాదా యాత్ర చేద్దాం అక్కడ అడిగి తెలుసుకో ఎక్కడ సంక్షేమ పథకాలు ఎక్కవ ఉన్నాయో తెలుస్తాయి. ఒక్కటి కంటే ఒకటి ఎక్కవగా ఉన్న మేము తల వoచుకుంటాము సవాల్ కి సిద్ధమా ? అని సవార్ చేశారు.

పార్లమెంట్ లో మీ గిరిజన శాఖ మంత్రి గిరిజన రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పిన మీకు తెలియదా ఇప్పుడు 10 శాతం రిజర్వేషన్ ఇస్తాము అని ఎలా చెబుతారని నిలదీశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ఇక్కడ మాట్లాడుతారు అనుకున్నాము…రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం రెచ్చగొట్టడం చేశారని మండిపడ్డారు. 8 ఏళ్ల నుండి రామప్పకు 1000 స్తంభాల గుడికి ఇది చేశాము అని చెబుతున్నారు ఏమి చేశారని నిలదీశారు.