నీటి కోసం కొట్టుకున్న మహిళలు.. రాజకీయంతో రాద్దాంతం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాక కూడా ప్రతీ చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని డి.హరేహాల్ మండలం సిద్దాపురంతండాలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శుద్ధ జల ప్లాంట్ వద్ద సిద్దాపురంతండాకు చెందిన మహిళలు తాగునీరు పట్టుకుంటున్న సమయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ తరుణంలో మహిళల గొడవలో కూడా రాజకీయ నాయకులు కల్పించుకొని రాద్దాంతం చేశారు.

వైసీపీ నాయకులను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు వచ్చారు. ఈ తరుణంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో 6 మంది టీడీపీ నాయకులు గాయపడ్డారు. గాయపడిన టీడీపీ నాయకులను బళ్లారి విమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న డి.హీరేహాల్ పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news