కాంగ్రెస్ ఎక్కడ బలపడింది..? కెసిఆర్ ను ఓడించే సత్తా బిజేపికే ఉంది – ఈటల

-

కాంగ్రెస్ ఎక్కడ బలపడింది..? కెసిఆర్ ను ఓడించే సత్తా బిజేపికే ఉందని తెలిపారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ వ్యూహం,బలం, బలహీనతలు నాకు మాత్రమే తెలుసు అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రతి రోజు మీడియాలో పూటకో రకరకాల వార్తలు వస్తున్నాయని.. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ పోరాడినప్పుడు మెదక్ జిల్లా పులకించిపోయిందని చెప్పారు.

ఈనాడు మాత్రం ఈయన మనకు ముఖ్యమంత్రి.. ఈయన్న మనం ఓట్లేసి గెలిపించింది అని అనిపిస్తోంది.. ఉద్యమంలో కేసీఆర్ ని ఎవరైనా ఏమైనా అంటే యువత ఫైర్ అయ్యేది..నేడు ఆయనకు వ్యతిరేకంగా యువతే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ వ్యూహం, ఆయన బలం, బలహీనతలన్ని ఈటెల కి తెలుసని చాలా మంది అంటున్నారు…మీ దెబ్బ పడితే దిమ్మతిరగాలి అని అంటున్నారు… చాలా మంది మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారన్నారు. మీ ఆశీర్వదాంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news