రాజగోపాల్ సైలెంట్ గేమ్..రేవంత్ పిలుపు..రెడీనా.!

-

తెలంగాణ బీజేపీలో భారీ స్థాయిలో అంతర్గత పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో నేత బయటకొచ్చి రాష్ర్ట బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ పై మండిపడుతున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావులు..బండి టార్గెట్ గానే ఫైర్ అవుతున్నారు. అయితే వీరిలో ఈటల పైకి విమర్శలు చేయడం లేదు గాని..లోలోపల బండి అంటే రగులుతున్నారు. ఇటు జితేందర్, రఘునందన్ ఓపెన్ గానే బండిని విమర్శిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఢిల్లీకి చేరుకుంది. కీలక నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో బి‌జే‌పిలో పలు మార్పులు జరగనున్నాయి. బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఖాయమని తెలుస్తుంది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇస్తారని సమాచారం..బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తుంది. అటు ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. అయితే ఇవన్నీ మీడియాలో వచ్చే కథనాలే..ఇంకా వీటిపై క్లారిటీ రాలేదు.

అయితే పార్టీలో ఇంత రచ్చ జరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఇటీవలే ఈటలతో పాటు ఈయన ఢిల్లీకి వెళ్లొచ్చారు. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు. ఇక కోమటిరెడ్డి పార్టీ మారిపోతారని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఎలాగో బి‌జే‌పి రేసులో వెనుకబడింది..అటు కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ లో చేరిపోతారని ప్రచారం వస్తుంది.

తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం..రాజగోపాల్‌ని కాంగ్రెస్ లోకి వచ్చేయాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో రాజగోపాల్..మునుగోడు నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదు. దీంతో అక్కడ క్యాడర్ కాంగ్రెస్ వైపు చూస్తుంది. అయితే ఇటీవల రాజగోపాల్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బి‌జే‌పి నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాజగోపాల్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయమని తెలుస్తుంది. చూడాలి మరి రాజగోపాల్ కాంగ్రెస్ వైపు వెళ్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news