కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చాల్సిందే – ఈటల రాజేందర్

-

కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయని… మహిళల పుస్తెల తాడు లు తెగడానికి కారణం కెసిఆర్ ప్రభుత్వం అని ఆగ్రహించారు.


మహిళల సంఘాలకు రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప రాష్ట్రం ఇవ్వకుండా వాళ్ళ నోట్లో మట్టికొట్టుందని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 4 వేల 400 కోట్లు మహిళలకు ఈ ప్రభుత్వం బకాయి ఉందని… మెడికల్ కాలేజీల్లో పీజీ డాక్టర్ లు 36 గంటలు డ్యూటీ చేస్తున్నారని వివరించారు. మహిళా డాక్టర్ లు ఎదుర్కుంటున్న బాధల పై కమిటీ వేయండని… పోలీస్ లు దరఖాస్తు ఇచ్చిన పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం ని కూల్చకపోతే రాష్ట్రం బాగుపడదని…ఇక్కడ ఎగిరేది కాషాయ జండా గెలిచేది బీజేపీ అని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news