దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లాకు వెళుతుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హకీంపేట దగ్గర పోలీసులు ఆయనను అరెస్టు చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలలో బాధిత హిందూ యువకులను పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని రఘునందన్ రావును అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. గజ్వేల్ లో అరెస్ట్ అయిన బిజెపి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకోవడం సరైంది కాదన్నారు.