ఒక్కరాత్రిలోనే అంతా సెట్ చేయలేం : మంత్రి జూపల్లి

-

తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనను ఒక్క రాత్రిలో మార్చలేమని దీనంతటిని సెట్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తమ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు శాఖల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్, పర్యటక శాఖలపై తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షలు చేపట్టి తీసుకురావాల్సిన మార్కులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.


ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకులు ఐదు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఇంత చేసినా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోలేని పరిస్థితికి తెచ్చారన్నారు. వీటన్నింటిని మార్చేందుకు ఉన్న పలంగా నిర్ణయాలు సాధ్యం కాదన్నారు. ఇటీవల టూరిజం శాఖ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news