వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి వడ్లని 1800 కి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మొక్కజొన్న కొనే నాధుడే లేడు. వర్షాలకు చాలా చోట్ల తడిశాయి. వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. ఒక్క రోజైన ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రైతుబంధు కూడా ఇవ్వలేదు. ఇంకా 22 లక్షల మందికి తెలంగాణలో రుణమాఫీ కాలేదు. రుణమాఫీపై ఎన్నో కొర్రీలు పెట్టి 100 కారణాలు చెబుతున్నారు.
రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటారు. లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి సుందరికరణ ఎలా చేస్తున్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకి రావాలి. రైతుల సమస్యల్ని పట్టించుకోని పరిష్కరించాలని BRS డిమాండ్ చేస్తుంది. ఆదిలాబాద్ లో సోయాబీన్ రైతులకు రెండు నెలలైన డబ్బులు ఇవ్వట్లేదు. సిద్దిపేటలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ అని హరీష్ రావు పేర్కొన్నారు.