పదేండ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్నారు : ఎంపీ కిరణ్

-

మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ వేస్తున్నాం. Brsలో రాజకీయ ఉద్యోగ నోటిఫికేషన్ పడింది. Brs అధ్యక్షుడు ఎవరు కావాలనే లొల్లి మొదలైంది అని ఎంపీ చామల కిరణ్ అన్నారు. అయితే హరీష్, కేటీఆర్ మధ్య మొదలైన లొల్లి ఎట్లా సరిదిద్దాలి వాళ్లకు అర్థం ఆవ్వడం లేదు. కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. అసెంబ్లీ కి రారు.. ప్రజల మధ్యకు రారు. కొడుకేమో మా అయ్య వస్తున్నాడు.. ఇదిగో అదిగో అంటున్నాడు.

ఇక సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ సీఎం అయ్యాడు. కేసీఆర్ పుణ్యాన రేవంత్ సిఎం అయ్యిండు అని నిన్న హరీష్ రావు అంటున్నాడు. Brs నేతలు తెలంగాణ కోసం పార్టీ పెట్టలేదు.. తెలంగాణ వస్తుంది అని కూడా అనుకోలేదు. ఎలక్షన్ లు.. కలక్షన్ లకోసమే పార్టీ పెట్టుకున్నారు. MLA కాకుండానే కాంగ్రెస్ పుణ్యాన మంత్రి అయ్యాడు హరీష్. ఎవరి పుణ్యమా అని ఎవరు లీడర్ అయ్యారు. పదేండ్లు అధికారంలో ఉండి.. లక్షల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తొని నిద్ర పట్టడం లేదు అని ఎంపీ కిరణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news