తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్..రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
భూ వ్యవసాయ భూమి కూడా కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. 12-12-2018 తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ.రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ పథకం అమలుకు ఐటి భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఉంటుంది. రుణమాఫీ అమలకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారి ఉంటారు.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లు నుంచి పథకం వర్తిస్తుంది. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాలకు బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసిన రుణాలకు పథకం వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.మహిళల పేరు మీద ఉన్న రుణాలకు ప్రయారిటీగా తీసుకొనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొదటగా మహిళల పేరు మీద ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్.