ఎవరూ భయపడవద్దు: జీహెచ్ఎంసి

జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కీలక వ్యాఖ్యలు చేసారు. వరదల నేపథ్యంలో నగరంలో 2,540 మందిని కాపాడాం అని ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేసారు. ఆహారం, తాగునీరు అందకుండా ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు సహాయక చర్యలు చేశాం అని ఆయన అన్నారు. సెల్లార్లలో నీటిని తోడేందుకు 72 డీవాటరింగ్ బృందాలు పనిచేస్తున్నాయి అని వివరించారు.

నగరలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6 బోట్లతో క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాం అని తెలిపారు. 202 సెల్లార్లలో నీటిని తోడి…విద్యుత్ ను పునరుద్దరించేందుకు సహాయక చేశాం అని ఆయన అన్నారు. ఆసుపత్రులు, సబ్ స్టేషన్లతో నీటిని తోడేందుకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నాం అని వివరించారు. 105 డీవాటరింగ్ పంపులు వీటికోసం పనిచేస్తున్నాయి అని తెలిపారు. అవసరం అయిన చోట్ల రోడ్లపై పేరుకున్న చెత్తను తరలించేందకు మెషినరీని ఉపయోగిస్తున్నాం అని అన్నారు. నగరంలో 390 చెట్లు నేలకూలిన చెట్లను 19 డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయని, వర్షాలు, వరదల నేపథ్యంలో డీఆర్ఎఫ్ వచ్చిన 645 ఫిర్యాదులు పరిష్కరించాం అని అన్నారు. వరదల అనంతరం అంటూ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరూ కంగారు పడవద్దు అని చెప్పారు.