తెలంగాణలో కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు కులవృత్తులను బలోపేతం చేసేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

‘‘కులవృత్తులను బలోపేతం చేసేందుకు, వారికి ఆర్థికంగా చేయూత అందిచేందుకు విధి విధానాలను రూపొందించాలని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా పథకం రూపకల్పన చేయాలని సీఎం సూచించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది.” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news