Fire broke out in Secunderabad: సికింద్రాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. చిలకలగూడలో చైన్ స్నాచింగ్ ముఠా సెల్ ఫోన్ దొంగలిస్తుండగా పోలీసుల కంటపడ్డారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా దొంగల ముఠా పారిపోయేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే ముఠాపై ఒక రౌండ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇక ఈ సంఘటనపై చిలకలగూడ సిఐ..మాట్లాడుతూ… తోపులాటలో మిస్ ఫైర్ అయిందన్నారు. చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసిందని..
సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన స్నాచింగ్ ముఠాపైఒక రౌండ్ కాల్పులు కానిస్టేబుల్ జరిపినట్లు వెల్లడించారు. అనంతరం ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్నారు.