Telangana : కొత్త సచివాలయంలో నీటిమీదే తొలి సమీక్ష

-

హైదరాబాద్ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ చరిత్రపుటలో మరో మకుటం కొలువుదీరబోతోంది. తెలంగాణ నూతన పాలనాసౌధం.. భాగ్యనగరం నడిబొడ్డున రేపు ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఎన్నో రకాలుగా ప్రఖ్యాతి గాంచనున్న ఈ నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలపై తొలి సంతకం చేయనున్నారన్న సంగతి తెలిసిందే.

అయితే సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత అందులో జరగనున్న మొదటి సమీక్ష ఏంటనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే అందరికీ ఆ సమాధానం తెలిసిందే. ఎందుకంటే.. తెలంగాణ సర్కార్ మొదటి నుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే నూతన సచివాలయంలో మొదటి సమీక్ష కూడా సాగునీటి రంగంపైనే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. సీతారామ, సీతమ్మసాగర్‌ బహుళార్ధక సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ సమీక్ష జరుగనుంది.

ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం 4 గంటలకు రెండో అంతస్థులోని ఏ వింగ్‌ మీటింగ్‌ హాల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతోపాటు, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఆయా జిల్లాలకు చెందిన చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news