Agent: అఖిల్ ఏజెంట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా..?

-

అక్కినేని అఖిల్ దాదాపు ఒక మంచి హిట్టు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.. అయితే కథల ఎంపిక విషయంలో తడబాటు వల్లే అఖిల్ ఇలా తన కెరీర్లో ఒక సక్సెస్ ను కూడా చూడలేదంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్వాలేదు అనిపించినా తాజాగా స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఏజెంట్ సినిమా పైన ఆయన పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో అది డిజాస్టర్ గా మిగిలింది.

అసలు సినిమా చూసిన ఆడియన్స్ అంతా అఖిల్ క్యారెక్టర్ కి , నటనకు ఏమాత్రం ఈ సినిమా సెట్ అవ్వదు అని, అఖిల్ ని ఇందులో అల్లరి, చిల్లరిగా చూపించారు. ఇది ప్రేక్షకులకు ఏమాత్రం సహించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇలా డిజాస్టర్ అవడం నిజంగా అఖిల్ అక్కినేని కెరియర్ కు పెద్దగా కలిసి రాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లు జరిగింది అనే విషయానికొస్తే..
నైజాం – రూ. 10.40 కోట్లు,
సీడెడ్ – రూ.4.30 కోట్లు,
ఉత్తరాంధ్ర – రూ.3.60 కోట్లు,
ఈస్ట్ – రూ. 2.40కోట్లు,
వెస్ట్ – రూ.2.10 కోట్లు,
గుంటూరు – రూ.2.65 కోట్లు,
కృష్ణా – రూ. 2.20 కోట్లు,
నెల్లూరు – రూ.1.08 కోట్లు,
ఏపీ , తెలంగాణ – రూ. 28.73 కోట్లు,
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.40 కోట్లు,
మలయాళం రూ. 0.70 కోట్లు,
ఓవర్సీస్ రూ. 3.50కోట్లు,
వరల్డ్ వైడ్ (టోటల్) రూ
29.79 కోట్లు షేర్ రాబట్టింది .

ఏజెంట్ సినిమా కు రూ.34.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news