గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టిన విషయం తెలిసిందే. దీంతో నదులు ఉపొంగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది ఏడు పాయల ఆలయం. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుంది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది మంజీరా వరద. ఈ వరద కారణంగా ఆరు రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటుంది అమ్మవారు.
అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో.. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 28181 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 15114 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం- 29.917 టీఎంసీలు అయితే ప్రస్తుతం 28.939 టీఎంసీల నీరు ఉంది.