ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలి : డిప్యూటీ సీఎం

-

ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులున్నాయి. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు. 

ఈ అంశం పై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, మౌసింగ్, లా సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ సమావేశమై వారం లోపు సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. కాలుష్యం ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తాము నగరం విడిచి ఔటర్ రోడ్డుకు బయటికి వెళ్తామని సబ్ కమిటీకి విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ లో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news