బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులు.. 13 మంది పరిస్థితి విషమం

-

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బల్లి పడిన ఆహారం తినడం వల్ల 34 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

గత రాత్రి భోజనం చేస్తుండగా ఒకరి పళ్లెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి బాలికలు గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్ వద్దకు చేరుకుని.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వరంగల్ ఎంజీఎంకు తరలివచ్చారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news