సీఎం జగన్ సంకల్పాన్ని పూర్తిగా అభినందిస్తున్నా – జయప్రకాష్ నారాయణ

-

అందరికి ఆరోగ్యం అనే పుస్తకం ఆవిష్కరించారు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య వైద్య రంగంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను మనసారా అభినందిస్తున్నానన్నారు. విద్యార్థుల్లో మంచి విద్య ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకువస్తున్నారని.. దీని గురించి చాలా మంది అధికారులు చెప్పినట్లు తెలిపారు.

ఎపీ ముఖ్యమంత్రి సంకల్పన్ని పూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకపోతే చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్, తమిళనాడు అని తెలియజేశారు. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ద్వారా నచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్లే అవకాశం కల్పించాలన్నారు. ఆంద్రప్రదేశ్ లో ఫ్రీ డయాగ్నోస్టిక్ ను బాగా అమలు చేస్తున్నారని కొనియాడారు.

ఆరోగ్యశ్రీని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేశారని.. ఆరోగ్యశ్రీ ద్వారా దేశానికి ఒక మార్గాన్ని చూపించారని అన్నారు. ఆరోగ్యశ్రీని చూసి ఆయుష్ మాన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులకు వైద్యం లభిస్తుందన్నారు జయప్రకాష్ నారాయణ. విద్య, వైద్య రంగంలో నాడు, నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులుతో ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news