బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కి ఎడమతుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఫామ్ హౌస్ వద్ద బాత్ రూంలో జారి పడటంతో ఎడమ తుంటి ఎముక విరిగిపోయింది. పంజాగుట్ట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ కోలుకునేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ యశోద ఆసుపత్రిలో ఉండగా.. పలువురు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ని పరామర్శించారు. యశోద ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ని కలిశారు. తాజాగా మాజీ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ని కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పలు కీలక విషయాల గురించి కూడా చర్చించారు.