అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ భవన్‌లో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు.. కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారు? కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ కున్న కేడర్ మరే పార్టీ కి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని, కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్‌కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదన్నారు. గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.