ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్‌

-

ఫాక్స్‌కాన్‌ కంపెనీ ద్వారా తొలి విడతలో 25 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ స్థాపనకు కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. దేశంలో ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని పునరుద్ఘాటించారు. 196 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యాంగ్ లియూ 16 వందల 55 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

‘ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశాం. ఫాక్స్‌కాన్‌ కంపెనీలో మెుదటి దశలో 25 వేల ఉద్యోగాలు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ ఏడాదిలోగా పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news