తెలంగాణలోని 1 కోటీ 20 లక్షల గృహాలకు ఉచితంగా జాతీయ జెండాల పంపిణీ

-

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ, యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శ్రీ కె. కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ప్రతి గుండెలో భారతీయత:
—————————————————-
‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సమీక్షించారు. ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news