అల్లంలో వున్న పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషదం. అరుగుదల సమస్యలు తగ్గించటానికి మరియు కాలనుగుణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అల్లం తినకుండా ఉంటేనే మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్టిగా ఉన్నవారు..
ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణరసాలను క్రమబద్దీకరించి జీర్ణక్రియ బాగా జరిగేలా చేయటమే కాకుండా ఆకలి తొందరగా కాకుండా చేసి బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే పొట్టిగా ఉండి బరువు తక్కువగా ఉన్నవారికి BMI(బాడీ మాస్ ఇండెక్స్) అల్పంగా ఉంటుంది. వారికి విటమిన్ల లోపం ఉండడం వల్ల పొట్టిగా ఉంటారు.అలాంటి వారు అల్లంకు దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
హిమోఫిలియా తో బాధపడేవారు అల్లం తీసుకోకూడదు. ఈ జబ్బు వున్నవారు సాధారణంగా శరీరం నుండి అధిక రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటి సమయంలో రక్తం గడ్డకట్టడం చాలా అవసరం. అల్లం సాధారణంగా శరీరంలో రక్త ప్రసరణను సాఫిగా జరగడానికి ఉపయోగిస్తారు.ఈ సమస్య ఉన్నవారు అల్లం తినడం వల్ల శరీరంలో అధిక మొతాదులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
ప్రెగ్నెన్సీ వున్న సమయంలో ముఖ్యంగా చివరి మూడు నెలలు అల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంలో చేర్చుకోకూడదు.ఇది సమయం పూర్తి కాకనే కాన్పు అయ్యేలా చేస్తుంది,మరియు తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తుంది.మధుమేహం,హై బీపీ కోసం మందులు వాడేవారు తక్కువ పరిమాణంలో మాత్రమే అల్లంను తీసుకోవాలి. అల్లంను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి సమస్యలతో ఉండేవారు, అల్లం తినకూడని వారు దానికి బదులుగా ఏమి తీసుకోవాలనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. పొట్టలో జీర్ణక్రియ బాగా జరగాలంటే అల్లం స్థానంలో మిరియాలను తినవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యుల సలహా తెలుసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది.