ఆర్టీసీ బ‌స్సు లో పుట్టిన ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఫ్రీ పాస్

-

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు ల‌లో పుట్టిన ఇద్ద‌రు చిన్నారుల‌కు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ అదిరి పోయే ఆఫ‌ర్ ఇచ్చాడు. ఇక నుంచి ఆ ఇద్ద‌రు చిన్నారులు జీవిత కాలం ఆర్టీసీ బ‌స్సు లో ఉచిత ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ అని స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించాడు. దానికి సంబంధించిన ఫ్రీ పాస్ ఇచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ఫ్రీ పాస్ తో ఆ ఇద్ద‌రు చిన్నారులు జీవిత కాలం తెలంగాణ‌ ఆర్టీసీ బ‌స్సు ల‌లో ఉచితం గా ప్ర‌యాణం చేయ‌డానికి వీలు ఉంటుంద‌ని అన్నారు.

కాగ తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు లో గత నెల 7 నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా లో ఒక చిన్నారి జ‌న్మించారు. అలాగే ఈ నెల 7 న సిద్ధిపేట్ జిల్లా లో మ‌రొక చిన్నారి జ‌న్మించారు. దీంతో ఆ ఇద్ద‌రు చిన్నారు ల‌కు తెలంగాణ ఆర్టీసీ జీవిత కాలం ఫ్రీ పాస్ ఇవ్వ‌నున్న‌ట్టు ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు. అలాగే ఈ రోజు గురువారం కావ‌డం తో బ‌స్సు దినోత్సవాన్ని నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు, ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. ఈ రోజు బ‌స్సు దినోత్సవం సంద‌ర్భంగా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది.. బ‌స్సుల‌లో నే ప్ర‌యాణం చేయాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news