గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెలిసిన పోస్టర్లు..!

-

తమ ఎమ్మెల్యే కనడుట లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పోస్టర్లు వెలిశాయి. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదని స్థానిక బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ అంటూ నినాదాలు చేస్తూ.. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇంద్ర పార్క్ చౌరస్తా, బస్టాప్ వద్ద, అంబేద్కర్ చౌరస్తా వద్ద, మున్సిపల్ ఆఫీస్ వద్ద కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్స్ అంటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలని, కాబట్టి గజ్వేల్ ఎమ్మెల్సేగా ఉన్న కేసీఆర్ ఎక్కడ ఉన్నాగానీ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎంగా ఉండు కాబట్టి తెలంగాణ కోసం పని చేశారు. ఇప్పుడు సీఎం పదవి, అధికారం లేదు.. అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఒక సాధారణ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న క్రమంలో ఇప్పుడు గజ్వేల్ కి రావడానికి ఏమైంది? అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలపైన ప్రేమ లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిపించిన కూడా ప్రజలపై కనీస కనికరం లేదా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో అనేక సమస్యలు ఉన్నాయని, గజ్వేల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైన కేసీఆర్ ఎక్కడ ఉన్న గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news