ఎత్తైన గాంధీ విగ్రహం నిర్ణయంపై మండిపడ్డ గాంధీ మునిమనుమడు

-

తెలంగాణలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే  బాపూఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు 1999లో అసెంబ్లీ ముందు 22 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని బాపూఘాట్ లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. “విగ్రహాల ఏర్పాటు పోటీకి నేను వ్యతిరేకిని. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు తుషార్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news