తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను పదో తరగతి చదువుతున్న గోరంట్ల సాయి అనే బాలుడు విజ్ఞాప్తి చేశాడు. తనకు ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదని.. అందుకే ప్రభుత్వమే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనను అక్క బావాలు వేధిస్తున్నారని అన్నారు. ఆ వేధింపుల కంటే మరణించడమే మేలని అన్నాడు. కాగ తనకు కారుణ్య మరణం కావాలని మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు తెలపాలని అనుకున్నట్టు తెలిపాడు. కాగ ఖమ్మం జిల్లాలోని నేలకొండ పల్లికి గ్రామంలో లక్ష్మీ నారాయణ, సుజాత ఉండేవారు.
వీరికి సాయితో పాటు మరొక కూతురు కూడా ఉంది. కూతురి వివాహం జరిగింది. కాగ లక్ష్మీనారాయణ, సుజాత ఆనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సాయి తన అక్క బావాలతో కలిసి ఉంటున్నాడు. అయితే తనను అక్క బావాలు గత కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నారని సాయి తెలిపాడు. ఆ వేధింపులు తట్టుకోలేక నేలకొండ పల్లికి వచ్చానా.. తనను వేధిస్తున్నారని తెలిపాడు. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. అయితే తనకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదని.. ప్రభుత్వం కారుణ్య మరణానికి అనుమతి ఇస్తే.. చనిపోతానని తెలిపాడు. అయితే తన చావుకు మాత్రం తన అక్క బావ లే అని తెలిపాడు.