రాముడు మీకే కాదు.. అందరికీ దేవుడే మత సామరస్యాన్ని ప్రతీ ఒక్కరూ కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జన జాతర సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ యువత కాంగ్రెస్ కి అండగా ఉందని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు చక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలిపారు. పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ బుకాయించే జీవో తీసుకొచ్చారని తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చూస్తాం అన్నారు.
బీజేపీ మతాలను రాజకీయాలకు వాడుకుంటుంది. ‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి’ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డికి ఓటు వేస్తే.. రేవంత్ రెడ్డికి వేసినట్టే అన్నారు. మాట తప్పిన కవితను నిజామాబాద్ రైతాంగం శాశ్వతంగా సమాధి చేశారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.