మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

-

బంగారం కొనుగోలు చేసే మహిళలకు బిగ్‌ షాక్ తగిలింది. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 51, 380 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 47, 100 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరిగి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1200 పెరిగి రూ. 61,200 గా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానప్పటిక బంగారం భారీగా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news