బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త

-

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. శనివారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 150 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 170 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50, 730 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46, 500 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 62,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news