తెలంగాణ కొత్త సచివాలయానికి గోల్డ్‌ రేటింగ్‌

-

ప్రారంభోత్సవానికి ముందే తెలంగాణ నూతన సచివాలయం అరుదైన ఘనత సాధించింది. కొత్త సెక్రటేరియట్ గోల్డ్ రేటింగ్ కోసం ఎంపికయింది. ఈ భవనాన్ని హరిత భవన మండలి ప్రమాణాల మేరకు నిర్మించడంతో గోల్డ్ రేటింగ్​కు ఎంపికైనట్లు హరిత భవన మండలి హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి చెప్పారు.  హరిత ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తే అందులో పని చేసే వారి ఉత్పాదకత పెరుగుతుందని, విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందని అన్నారు.

‘‘గోల్డ్ రేటింగ్‌ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో మరొకటి లేదు. హరిత ప్రమాణాల మేరకు భవనాలను నిర్మించనున్నట్లు ఆయా సంస్థలు ఐజీబీసీకి దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్‌ ఉంటుంది. నిపుణుల బృందం ఆ నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. నిర్మాణ తీరుతెన్నులు తెలుసుకుంటుంది. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా భవనంలోకి రావాలి. నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్‌, ఆటోమేటిక్‌ విద్యుత్తు పరికరాలు ఉపయోగించాలి. పాటించిన నిబంధనల ప్రకారం ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌, సర్టిఫికెట్‌.. ఇలా గుర్తింపు ఉంటుంది.” అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news