తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ తో పాటు స్టైఫండ్ విడుదల చేయడానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఇక త్వరలోనే ఫీజ్ రీయింబర్స్ మెంట్ తో పాటు స్టైఫండ్ కు సంబంధించిన డబ్బులు విద్యార్థుల అకౌంట్ లో జమన కానున్నాయి. వీటి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 564.88 కోట్లు విడుదల చేసింది. అంతే కాకుండా దానికి సంబంధించిన జీవో ను కూడా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
కాగ గత బడ్జెట్ సమావేశాలలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ కోసం రూ. 1300 కోట్ల ను తెలంగాణ ప్రభుత్వ కేటాయించింది. అందులో భాగం గా ఈ రోజు నిధుల విడుదల జీవో ను జారీ చేసింది. అయితే చాలా మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్ మెంట్ తో పాటు స్టైఫండ్ కోసం ఎదురు చుస్తున్నారు. కాగ హుజురాబాద్ ఉప ఎన్నికల లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయిన నాటి నుంచి కేసీఆర్ దిద్ధుబాటు చర్యలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఉన్న హామీ లను నేరవేస్తున్నారు.