రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మే 09 తరువాత రైతుబంధు పడని రైతు ఉండడని తెలిపారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు రామసహాయం రఘురామిరెడ్డి, బలరామ నాయక్ లకు మద్దతుగా సీఎం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించిందని.. ఈనెల 8లోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత మాదే అన్నారు. ఈనెల 9లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తా అన్నారు. రైతు భరోసా నిధులు అందితే.. కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అన్నారు.