గ్రాడ్యుయేట్స్ కి గుడ్ న్యూస్.. పోలింగ్ రోజు సెలవు

-

ఉమ్మడి నల్లగొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తాజాగా ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ప్రస్తుత నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనున్నది. ఇక ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబంధనలు లేవని వివరించింది సీఈఓ ఆఫీస్. ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించింది. అయినప్పటికీ కొంత మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం సెలవు అని ఇంకా తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news