గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరికి తెలంగాణాలో కరోన ఉండదు…!

-

తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు అని అన్నారు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు. ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన అన్నారు.

coronavirus
coronavirus

తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో పెరుగుతున్నాయి అని అన్నారు. ఈ నెల చివరికి హైదరాబాద్ లో కరోనా తగ్గుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్‌ రేటు నమోదవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తాజాగా కరోనా నివారణ చర్యలకు వంద కోట్లు కేటాయించిందని అన్నారు. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బని చెప్పారు. 11 వందల సెంటర్స్ లో రోజుకు 20 వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news