కాంగ్రెస్ ప్రభుత్వం కృషి తోనే హైదరాబాద్ కి మంచి నీరు : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం కృషి తోనే హైదరాబాద్ కి మంచి నీరు వచ్చిందని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5,827 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. రూ.3500 కోట్లతో రోడ్డ అభివృద్ధి, ఏడు ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్కు ఇంటర్ ఛేంజ్ పనులకు శంకుస్థాపన చేశారు. తాగుటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రూ.45కోట్లతో 19 రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. 

cm revanth reddy
cm revanth reddy

ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాదులో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ. 7 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 3, 2024 ఈరోజు. డిసెంబర్ 03, 2023 నాడు తెలంగాణ తీర్పు ఇచ్చిన రోజు.. డిసెంబర్ మొదటి వారంలో విజయోత్సవాలు.. భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకుంటామని తెలిపారు. పీజేఆర్ హైదరాబాద్ కి నీళ్లు రావాలని కొట్లాడారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బిందెలు పట్టుకొనే నిరసన తెలిపేవారు. అలా చేయడం వల్లనే హైదరాబాద్ కి కృష్ణా, గోదావరి నీళ్లు వచ్చాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news