చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు : సజ్జల రామకృష్ణారెడ్డి

-

సీఎంగా ప్రమాణం చేయకముందే చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు.

ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమేల కానీ ఇప్పుడు సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news