రెండు రోజుల కిందట ప్రముఖ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. 2022లో ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దేశ ద్రోహం కేసు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పది సెక్షన్ల కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కేసు బుక్ చేశారు పోలీసులు.
అయితే… ప్రొఫెసర్ హరగోపాల్‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేయడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డిజీపీని ఆదేశించారట సీఎం కేసీఆర్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.